ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వచ్ఛ సర్వేక్షణ్​ - 2020 సందర్భంగా తిరుపతిలో మానవహారం - స్వచ్ఛ సర్వేక్షన్-2020లో భాగంగా తిరుపతిలో మానవహారం

స్వచ్ఛ సర్వేక్షణ్​ - 2020లో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పర్యవేక్షణ బృందం తిరుపతిలో శనివారం పర్యటిస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ పి.ఎస్.గిరీషా తెలిపారు.

Human chain  in Tirupati as part of Pure Survey -2020
స్వచ్ఛ సర్వేక్షన్-2020లో భాగంగా తిరుపతిలో ర్యాలీ

By

Published : Jan 3, 2020, 3:25 PM IST

స్వచ్ఛ సర్వేక్షణ్​ - 2020 సందర్భంగా తిరుపతిలో మానవహారం

చిత్తూరు జిల్లా తిరుపతిలో స్వచ్ఛ సర్వేక్షణ్​ - 2020లో భాగంగా విద్యార్థులు మానవహారం నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి అన్నారావు కూడలి వరకు రహదారికి ఇరువైపులా విద్యార్థులు నిలబడి.... ఫ్లకార్డులు ప్రదర్శించారు. పరిసరాల పరిశుభ్రత - ప్రతి ఒక్కరి బాధ్యత, ఒక్కో అడుగు పరిశుభ్రత వైపు అంటూ నినాదాలు చేశారు. స్వచ్ఛతపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని నగరపాలక సంస్థ కమిషనర్ పి.ఎస్.గిరీషా తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ - 2020 జాబితాలో తిరుపతి నగరాన్ని మెుదటి స్థానంలో నిలపడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ పర్యవేక్షణ బృందం తిరుపతిలో శనివారం పర్యటిస్తుందని కమిషనర్‌ తెలిపారు. నగరంలో అమలవుతోన్న పారిశుద్ధ్య కార్యక్రమాల్లో నగర పౌరులందరూ భాగస్వాములవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details