చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీవారిమెట్టు వద్ద టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో అలిపిరి బైపాస్ రోడ్డు వద్ద ఓ టాటా సఫారీ వాహనం వేగంగా వచ్చింది. అధికారులు వాహనాన్ని ఆపి తనిఖీలు చేస్తుండగా... అక్రమంగా తరలిస్తున్న 28 ఎర్రచందనం దుంగలు, టాటా సఫారీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారులను చూసి పరారైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టుబడ్డ ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని ఎస్పీ సుందరరావు తెలిపారు.
అధికారుల తనిఖీలు... ఎర్రచందనం దుంగలు పట్టివేత - chithore-district crime
చిత్తూరు జిల్లా అలిపిరి బైపాస్ రోడ్డు వద్ద టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
ఎర్రచందనం దుంగలు పట్టివేత