ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోవా నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత - huge liquor load caught at tamballapalli

రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ మద్యం అక్రమ రవాణా వెలుగుచూస్తూనే ఉంది. గోవా నుంచి తరలివస్తున్న సరకును పక్కా సమాచారంతో కాపు కాసి పట్టుకున్నారు చిత్తూరు పోలీసులు. స్వాధీనం చేసుకున్న సరకు విలువ లక్షా పదివేల రూపాయలకు పైగానే ఉంటుందని అదనపు ఎస్పీ తెలిపారు.

liquor load caught at tamballapalli
పట్టుకున్న సరుకుతో పాటు అదుపులోకి తీసుకున్న నిందితులు

By

Published : Nov 5, 2020, 8:43 PM IST

గోవా నుంచి ఐచర్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని.. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం గుండ్లపల్లిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1,10,420 రూపాయల విలువైన మద్యం సీసాలను వాహనం అడుగు భాగంలో పేర్చి తీసుకు వస్తుండగా.. మాటువేసి పట్టుకున్నట్లు అదనపు ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు.

ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా.. మరొకరు పరారైనట్లు వెల్లడించారు. వాహనంతో కలిపి స్వాధీనం చేసుకున్న సరుకు విలువ 5 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని వివరించారు. కేసు నమోదు చేశామన్నారు.

ABOUT THE AUTHOR

...view details