చిత్తూరు జిల్లా రేణిగుంటలోని 86 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వెంకటాపురం చెరువులో మల్లమడుగు కార్పొరేషన్ సభ్యులు రూ.3 లక్షలు ఖర్చుచేసి చేపలు పెంచుతున్నారు. ఇవాళ 4 టన్నుల చేపలు చనిపోయి చెరువులో తేలాయి. సుమారు 14 రోజుల క్రితం కొన్ని చేపలు చనిపోవటంతో ఈ చెరువులోని నీటిని నెల్లూరు జిల్లాలో ల్యాబ్‌కు పంపి పరీక్షించారు.
నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయిందని, అమ్మోనియా 0% ఉండాల్సింది... 0.2 శాతానికి పెరిగిందని నిపుణులు గుర్తించారు. కాలుష్యం, వాతావరణంలోని మార్పులు కారణమని వారు తెలిపారు. ప్రస్తుతం మందులు వాడుతున్నా... పెద్ద మొత్తంలో చాలా చేపలు చనిపోవటం చాలా బాధని మిగిల్చిందని కార్పొరేషన్ సభ్యులు తెలిపారు. చెరువుపై వచ్చే ఆదాయం మీద ఆధారపడిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.