చిత్తూరు జిల్లా రేణిగుంట పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాల పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిప్రమాదం జరిగిన స్థలం పక్కనే ఉన్న పైపుల పరిశ్రమకు మంటలు వ్యాపించాయి. రెండు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలార్పారు. సుమారు రూ.10 లక్షలు ఆస్తినష్టం జరగవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు.
రేణిగుంటలో అగ్నిప్రమాదం... 10 లక్షల ఆస్తి నష్టం - చిత్తూరు
చిత్తూరు జిల్లా రేణిగుంటలో అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాల పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.
రేణిగుంటలో అగ్నిప్రమాదం
ఇదీ చదవండి...