ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పొంగుతున్న వాగులు..పొలాల్లో ఇసుక మేటలు

By

Published : Dec 8, 2020, 7:48 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని నది పరివాహక ప్రాంతంలో ఉన్న పొలాలు నీట మునిగాయి. నివర్ తుపాన్ దాటికి స్వర్ణముఖి, కళ్యాణి, భీమా, దోసిళ్ళ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వరి, మామిడి, ఆరు తడి పంటల్లోకి భారీగా వరద నీరు చేరింది. పలు చోట్ల భారీ ఇసుక మేటలు ఏర్పడ్డాయి.

nivar cyclone
nivar cyclone

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని స్వర్ణముఖి, కళ్యాణి వాగు, భీమా, దోసిళ్ళ వాగు పరివాహక ప్రాంతాల్లోని పంటలు పూర్తిగా నీటమునిగాయి. కళ్యాణి డ్యామ్ కు భారీ స్థాయిలో వరద నీరు చేరడంతో 840 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఫలితంగా నదీ పరివాహక ప్రాంతంలోని వరి, మామిడి, ఆరు తడి పంటల్లోకి వరద నీరు ప్రవహించి ఇసుక మేటలు ఏర్పడ్డాయి. గొల్లవాని సమీపంలో ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీనివాసమంగాపురం-నరసింగాపురం మార్గమధ్యలో కల్లేటి వాగు ఉద్ధృతంగా సాగుతోంది. ఇటువైపు నుంచి ప్రయాణించేవారు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న పలుచోట్ల రోడ్డు దాటకుండా ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పంట నష్టపోయిన రైతులు ఆదుకునేలా ప్రభుత్వం సహాయక చర్యలను చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details