ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతిలో వైఎస్సార్ జగనన్న గృహనిర్మాణాలకు భూమి పూజ - ysrcp jagananna colonies latest news

వైఎస్సార్ జగనన్న ఇళ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి భూమి పూజ చేశారు. లబ్ధిదారులకు జియోట్యాగింగ్ పనులు ప్రారంభించారు. ప్రతి పేదవాని సొంతింటి కలను ముఖ్యమంత్రి జగన్ నేరవేర్చుతారని హామీ ఇచ్చారు.

ysr jagananna colonies
ysr jagananna colonies

By

Published : Jun 8, 2021, 7:05 PM IST

వైఎస్ రాజశేఖర్​రెడ్డి 45 లక్షల మంది పేదలకు పక్కా గృహాలు నిర్మించి రికార్డు సృష్టించగా జగన్మోహన్​రెడ్డి ఊళ్లు నిర్మించి రికార్డు సృష్టించబోతున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలోని 9 వేల పేద కుటుంబాలకు ఏర్పేడు మండలం చిందేపల్లె సమీపంలోని 225 ఎకరాల్లో కేటాయించిన ఇంటి స్థలాలు పక్కా గృహాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. లబ్ధిదారులకు జియో ట్యాగింగ్ పనులు ప్రారంభించారు. ప్రతి పేదవానికి సొంత ఇంటి కల నెరవేరుతుందని భూమన హామీ ఇచ్చారు. బియ్యపు మధుసూదన్ రెడ్డి , తిరుపతి నగర మేయర్ శిరీష, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

రైవాడలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ

నిరుపేదలకు ఇళ్ల స్థలాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రైవాడ సర్పంచ్ లక్ష్మీ అన్నారు. విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ పంచాయతీకి చెందిన 18 మందికి కొత్తగా ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరయ్యాయి. వాటిని సర్పంచ్ లబ్ధిదారులకు అందజేశారు. సొంతిల్లు లేని నిరుపేదలు దరఖాస్తు చేసుకుంటే వారికి అందిస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:యూరియాతో చిక్కని పాలు .. నిర్వాకం బట్టబయలు!

ABOUT THE AUTHOR

...view details