చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని హీరా కాలేజ్, ఏరియా ఆసుపత్రులను కోవిడ్ కేర్ సెంటర్లుగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అధికారులు ఎంపిక చేశారు. ఆసుపత్రులను జేసీ వీరబ్రహ్మం, ఆర్డీవో కనకనరసారెడ్డిలు పరిశీలించారు. హీరా కళాశాలలో 35 గదులు ఉన్నాయని.. ఒక్కో గదిలో 7 మంది చొప్పున 250 బెడ్లు ఏర్పాటు చేస్తున్నామని జేసీ తెలిపారు.
కోవిడ్ కేర్ కిట్స్, మెడికల్ కిట్స్, పౌష్టికాహారం, నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే చెవిరెడ్డి సహకారంతో పంపిణీ చేస్తున్నామన్నారు. ఆక్సిజన్ పైప్ లైన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. మరో రెండు మూడు రోజుల్లో కరోనా రోగులకు అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఎమర్జెన్సీకి 4 వెంటిలేటర్ల బెడ్లు సైతం అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. 100 పడకలతో చంద్రగిరి ఏరియా ఆసుపత్రిని కోవిడ్ కేర్ సెంటర్ గా తీర్చిదిద్దుతామని వివరించారు.