ఈనెల 7న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించడానికి.. ఓఎస్డీ శశిధర్ రెడ్డి, కలెక్టర్ హరి నారాయణ, ఎస్పీ సెంథిల్ కుమార్తో పాటు ఇతర అధికారులు చిత్తూరు జిల్లా మదనపల్లి వచ్చారు.
ఆయన పర్యటించనున్న సత్సంగ్ ఫౌండేషన్ పరిసర ప్రాంతాలను అధికారులు పర్యవేక్షించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం కానున్న యోగా శిక్షణ కేంద్రంతో పాటు పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.