చిత్తూరు జిల్లా రేణిగుంట పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఏర్పేడు జనసేన జడ్పీటీసీ అభ్యర్థి నితీష్‌పై రేణిగుంట వైకాపా నేతలు దాడిచేశారు. నితీష్‌ను ఏర్పేడు తీసుకెళ్లేందుకు రేణిగుంట పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఏర్పేడుకు వెళ్తే వైకాపా నేతల నుంచి ప్రాణహాని పొంచి ఉందని నితీష్ భయాందోళన వ్యక్తం చేశారు. పోలీసులు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా వాహనం నుంచి నితీష్ దూకారు.
చిత్తూరు జిల్లా రేణిగుంట పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత - ycp cadre attack on Janasena leader
చిత్తూరు జిల్లా రేణిగుంట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జనసేన జడ్పీటీసీ అభ్యర్థులను అపహరించారంటూ ఆ పార్టీ శ్రీకాళహస్తి ఇన్‌ఛార్జిపై కేసు పెట్టారు. వైకాపా నేతల బెదిరింపులతో వాళ్లే తమ వద్దకు వచ్చారని నగరం వినుత చెప్పారు. వైకాపా నేతలే ఫిర్యాదు చేయించారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేణిగుంట పోలీస్‌స్టేషన్‌కు నగరం వినుత, ఆమె భర్తను పోలీసులు పిలిపించారు. రేణిగుంట, ఏర్పేడులో నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని వినుత ఫిర్యాదు చేశారు.
రేణిగుంట పీఎస్‌కు తీసుకొచ్చి నితీష్‌పై వైకాపా నేతలు దాడికి పాల్పడ్డారు. జనసేన, వైకాపా నాయకుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. జనసేన రాష్ట్ర సమన్వయకర్త పసుపులేటి హరిప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జనసేన పార్టీ జిల్లా ఎన్నికల పరిశీలకుడు బొలిశెట్టి సత్యను పోలీసులు అరెస్ట్ చేశారు. వైకాపా నేతలు, పోలీసులు కమ్మక్కయ్యారని జనసేన నాయకులు ఆరోపించారు. జడ్పీటీసీ నామినేషన్ వెనక్కి తీసుకోనందునే కక్ష సాధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండీ... అన్ని పార్టీల నేతల ఫిర్యాదులూ స్వీకరిస్తున్నాం: డీజీపీ