ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెరువు భూములకు పట్టా ఎలా ఇస్తారు ? హైకోర్టు

చిత్తూరు జిల్లా యర్రమరెడ్డిపాలెం చెరువు భూములను ఓ వ్యక్తికి పట్టా మంజూరు చేయటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెరువు భూములను రక్షించాల్సిన అధికారులే.. ఆ స్థలంలో ఓ వ్యక్తికి పట్టా మంజూరు చేయడమేంటని నిలదీసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది.

హైకోర్టు
హైకోర్టు

By

Published : Mar 17, 2022, 3:25 AM IST

చెరువు భూములను రక్షించాల్సిన అధికారులే.. ఆ స్థలంలో ఓ వ్యక్తికి పట్టా మంజూరు చేయడమేంటని హైకోర్టు నిలదీసింది. సంబంధిత రికార్డులను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. ప్రకృతి ఎప్పుడూ మానవాళికి హాని తలపెట్టదని.. మనమే సహజ వనరులను నాశనం చేస్తున్నామని వ్యాఖ్యానించింది. వ్యవస్థ వ్యక్తులను నియంత్రించకుండా .. దురదృష్టవశాత్తు వ్యక్తులే వ్యవస్థను నియంత్రిస్తున్నారని పేర్కొంది.

చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం యర్రమరెడ్డిపాలెం చెరువు స్థలంలో పట్టా ఇచ్చిన విషయం, చెరువు స్థలాన్ని చదును చేస్తున్న వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ చేయాలని, రికార్డులు కోర్టు ముందు ఉంచాలని రెవెన్యూ , జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శులు , చిత్తూరు జిల్లా కలెక్టర్ , తిరుపతి ఆర్డీవో , రేణిగుంట తహసీల్దార్​కు నోటీసులు జారీచేసింది. మరోవైపు చెరువు స్థలంలో పట్టా పొంది , ఆ స్థలాన్ని చదును చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టి.చిరంజీవి అనే వ్యక్తికి నోటీసు ఇచ్చింది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వీవీ శేషసాయి ,జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నీటిపారుదలశాఖకు చెందిన యర్రమరెడ్డిపాలెం చెరువు స్థలాన్ని టి.చిరంజీవి అనే వ్యక్తి యంత్రాలతో చదును చేయిస్తున్నారని.. ఆ ప్రక్రియను నిలువరించాలని గ్రామానికి చెందిన రైతు జయరామయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఇదీ చదవండి:Viveka Murder case : సీబీఐ వేసిన ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details