చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు విషయంలో ఆలస్యం చోటుచేసుకోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంపై ఈనెల 24న స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని న్యాయశాఖ కార్యదర్శిని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర , జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు అదేశాలిచ్చింది. శ్రీకాళహస్తిలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటులో జాప్యాన్ని సవాలు చేస్తూ ఎం.ప్రసాద్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
అక్కడ కోర్టు ఏర్పాటు జాప్యంపై హైకోర్టు అసంతృప్తి - చిత్తూరు జిల్లా వార్తలు
శ్రీకాళహస్తిలో కోర్టు ఏర్పాటు జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై న్యాయశాఖ కార్యదర్శి స్వయంగా హజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
పలు కారణాలు చూపుతూ కోర్టు ఏర్పాటులో ప్రభుత్వం జాప్యం చేస్తుందని న్యాయవాది చంద్రయ్యనాయుడు వాదనలు వినిపించారు. సంబంధిత కోర్టులో సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన లేదా ఒప్పంద పద్దతిలో నియమించాలా? అనే విషయంపై స్పష్టత కోసం ప్రభుత్వం .. హైకోర్టుకు లేఖ రాసిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ తెలిపారు. శాశ్వత పద్ధతిలో అయితే అదనపు పోస్టుల మంజూరు కోసం రాష్ట్ర క్యాబినెట్ నుంచి ఆమోదం తీసుకోవాల్సి ఉందన్నారు. దీంతో న్యాయ శాఖ కార్యదర్శి హాజరుకు ధర్మాననం ఆదేశించింది.
ఇదీ చదవండి:high court : లీగల్ ఫీజుల చెల్లింపులో జాప్యంపై హైకోర్టు ఆక్షేపణ