ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరులో 'ఫోర్జరీ' సంతకాలపై వ్యాజ్యం - చిత్తూరు మున్సిపల్​ ఎన్నికలు తాజా వార్తలు

చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని 18 డివిజన్లలో తెదేపా అభ్యర్థుకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తమ నామినేషన్లను ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరించారంటూ తెదేపా అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. వివరణ ఇవ్వాలని ఎస్​ఈసీని ఆదేశించింది.

ap high court
ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు

By

Published : Mar 8, 2021, 5:23 AM IST

చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని 18 డివిజన్లలో తెదేపా అభ్యర్థులకు చెందిన నామినేషన్ల ఉపసంహరణపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తమ నామినేషన్లను ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరించారంటూ తెదేపా అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ ఆదివారం ఇంటి వద్ద విచారణ జరిపారు. ప్రభుత్వ న్యాయవాది సుమన్ .. ఈ వ్యాజ్యానికి విచారణ అర్హత లేదన్నారు. ఎన్నికల కమిషన్ సూపర్ ట్రైబ్యునల్ గా వ్యవహరిస్తోందన్నారు . ఎన్నికల్లో అక్రమాలపై ఎన్నికల ట్రైబ్యునల్ ను ఆశ్రయించడమే మార్గం అన్నారు. ఆ వాదనలను తోసిపుచ్చిన న్యాయమూర్తి.. ఎన్నికల ప్రక్రియకు కళంకం తీసుకొచ్చేలా వ్యవహారాలున్నప్పుడు సైతం న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదా ? అని ప్రశ్నించారు .

ఎన్నికల్లో వంచనపూరితంగా వ్యవహరించినప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చని పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై పలు తీర్పులు ఇచ్చిందన్నారు. ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లను ఉపసంహరించారంటూ ఎస్ఈసీకి ఫిర్యాదులు అందాయని ఎస్ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినపించారు. అధికరణ 243 ను అనుసరించి ఈ వ్యవహారంపై కలెక్టర్ల నుంచి నివేదికలు కోరామన్నారు. సోమవారం ఆ ఫిర్యాదులపై స్థాయి నివేదికలను తెప్పించుకుని వాటిని కోర్టుకు సమర్పిస్తామన్నారు. అననంతరం ధర్మాసనం విచారణను నేటికి వాయిదా వేసింది. తిరుపతి ఏడో వార్డుకు సంబంధించి ఇప్పటికే పెండింగ్ లో ఉన్న కేసుతో సహా ఇవాళ మధ్యాహ్నం తదుపరి వాదనలు విననుంది.

ABOUT THE AUTHOR

...view details