Margadarshi: హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రధాన కార్యాలయంలో సోదాల నిమిత్తం విజయవాడ జిల్లా రిజిస్ట్రార్ జారీ చేసిన వారెంట్ అమలును నిలిపివేస్తూ ఈ నెల 16న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మంగళవారం పొడిగించింది. హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రధాన కార్యాలయంలో సోదాల నిమిత్తం విజయవాడ జిల్లా సబ్ రిజిస్ట్రార్ ఈనెల 13న జారీ చేసిన వారెంట్‌ను సవాల్ చేస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే.
మార్గదర్శి కేసులో హైకోర్టు స్టే పొడిగింపు - High Court Latest News
Margadarshi: హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రధాన కార్యాలయంలో సోదాల నిమిత్తం విజయవాడ జిల్లా రిజిస్ట్రార్ జారీ చేసిన వారెంట్ అమలును నిలిపివేస్తూ ఈ నెల 16న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మంగళవారం పొడిగించింది.
Margadarshi
ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ ముమ్మినేని సుధీర్‌కుమార్ మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. కౌంటర్ దాఖలు చేయడానికి ఏపీ ప్రభుత్వం గడువు కోరడంతో విచారణను జనవరి 27వ తేదీకి వాయిదా వేశారు. మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం.వి.దుర్గాప్రసాద్ కోరడంతో ఆ మేరకు ఆదేశాలిచ్చారు.
ఇవీ చదవండి: