ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Balakrishna: అభిమానికి బాలయ్య ఫోన్​.. రూ.40వేలు ఆర్థిక సాయం - hero balakrishna phone call to his fan latest news

చిత్తూరు జిల్లా గొల్లపల్లకి చెందిన మురుగేష్.. బాలయ్యకు వీరాభిమాని. కొన్ని రోజుల క్రితం చెట్టు మీద నుంచి కిందపడటంతో.. మంచానికే పరిమితమయ్యారు. విషయం తెలుసుకున్న బాలయ్య.. తన అభిమానిని ఫోన్​లో పరామర్శించి.. ఆర్థిక సాయం చేశారు.

hero balakrishna phone call to his fan at chittor suffering with health issues
అభిమానికి బాలయ్య ఫోన్​లో పరామర్శ.. రూ.40వేల ఆర్థిక సాయం

By

Published : Jun 13, 2021, 7:57 PM IST

హీరో బాలకృష్ణ.. అభిమానులపై ఆయనకు ఉన్న ఆప్యాయతను మరోసారి చాటుకున్నారు. చిత్తూరు జిల్లా గొల్లపల్లకి చెందిన మురుగేష్.. బాలయ్యకు వీరాభిమాని. కొన్ని రోజుల క్రితం చెట్టు మీద నుంచి మురుగేష్ కిందపడటంతో.. మంచానికే పరిమితమయ్యారు. విషయం తెలుసుకున్న బాలయ్య.. తన అభిమానిని ఫోన్​లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని తెలిపారు.

తాను మంచానికి పరిమితమవ్వటంతో.. తన తల్లి కూలి పనులు చేస్తోందని మురుగేష్ ఆవేదన చెందారు. బాలకృష్ణ ఆదేశాల మేరకు.. రూ.40 వేలు తక్షణ సహాయాన్ని అభిమానులు ఆయనకు అందించారు.

ABOUT THE AUTHOR

...view details