కుప్పంకు 50 కిలోమీటర్ల దూరంలోని.. కందిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హెలికాఫ్టర్ అత్యవసరంగా పొలాల్లో దిగింది. కోయంబత్తూర్‌కు చెందిన ఓ నగల వ్యాపారి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకన్న దర్శనం కోసం హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. అయితే వాతావరణం అనుకూలంగా లేనందున అత్యవసరంగా పొలాల్లో దించారు. దీనిని చూసేందుకు జనం ఎగబడ్డారు. రెండు గంటల అనంతరం హెలికాఫ్టర్ బయలుదేరి తిరుపతికి పయనమైంది.
పొలంలో దిగిన హెలికాఫ్టర్ - చిత్తూరు జిల్లాలో పొలాల్లో దిగిన హెలికాఫ్టర్
కోయంబత్తూర్‌కు చెందిన నగల వ్యాపారి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి హెలికాఫ్టర్‌లో పయనమయ్యారు. అయితే వాతావరణం పరిస్థితి సరిగా లేక పొలాల్లో హెలికాఫ్టర్‌ను దించారు.
![పొలంలో దిగిన హెలికాఫ్టర్ helicopter emergency landed in farms](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9223958-298-9223958-1603028048832.jpg)
వాతావరణం అనుకూలంగా లేక పొలాల్లో దిగిన హెలికాఫ్టర్