ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రహదారిపై గార్గేయ ప్రవాహం.. రాకపోకలకు ఆటంకం - Gargaya River latest news

వర్షాల ధాటికి చిత్తూరు జిల్లాలోని గార్గేయ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రహదారిపై నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. స్థానికులు ప్రమాదకరంగా ఉన్న వాగును దాటేందుకు ప్రయత్నించి.. తప్పనిసరి పరిస్థితుల్లో సాహసాలు చేస్తున్నారు.

రహదారిపై నుంచి ప్రవాహిస్తున్న గార్గేయ నది
రహదారిపై నుంచి ప్రవాహిస్తున్న గార్గేయ నది

By

Published : Nov 28, 2020, 5:46 PM IST

రహదారిపై నుంచి ప్రవాహిస్తున్న గార్గేయ నది

చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలోని సదుంలో గార్గేయ నది.. రహదారిపై పొంగి ప్రవహిస్తోంది. కొందరు స్థానికులు వరద ప్రవాహం ప్రమాదకరంగా ఉన్నప్పటికీ దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. జెేసీబీ సాయంతో కొంత మంది వాహనాలను, ప్రజల్ని రోడ్డుకు అవతలివైపుకు చేరవేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్థులను అడ్డుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details