ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీమ నేలపై వర్షం..అన్నదాత హర్షం - rains in rayalaseema area

కరవు సీమపై వరుణుడు కరుణ చూపాడు. నిరంతరం సాగు, తాగు నీటి సమస్యలతో సతమవుతున్న రాయలసీమ ప్రజలకు ఇటీవల కురుస్తోన్న వర్షాలు ఊరటనిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సీమ నేలపై వర్షం... అన్నదాత హర్షం

By

Published : Sep 20, 2019, 5:10 PM IST

సీమ నేలపై వర్షం..అన్నదాత హర్షం

చిత్తూరు జిల్లాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.తంబళ్లపల్లిలోని పెద్దేరు జలకళను సంతరించుకుంది.నియోజకవర్గంలోని900పై గా ఉన్న చెరువులు,కుంటల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.వర్షాధార మెట్ట సేద్యం పంటలైన వేరుశనగ,చిరుధాన్యాలు,టమోటా,కూరగాయలు,మల్బరీ,ఇతర పంటలకు ఈ వర్షం ఎంతో మేలు చేసిందని రైతులు చెప్పారు.ఐదేళ్ల తర్వాత వస్తోన్న వరదను చూసి అన్నదాతలు మురిసిపోతున్నారు.ఈ వర్షాలతో వ్యవసాయ బోర్లలో నీటి మట్టంతో పాటు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని ఆశిస్తున్నారు.పశుగ్రాస కొరత కూడా తీరిందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details