చిత్తూరు జిల్లాలోని వివిధ మండలాల్లో నిన్న సాయంత్రం భారీ వర్షం కురిసింది. పెద్దపంజాని మండలంలో వడగళ్ల వాన పడింది. బైరెడ్డిపల్లె, వి. కోట మండలాల్లో కురిసిన వానకి చిన్న చిన్న చెరువులతో పాటు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. బైరెడ్డిపల్లె సమీపంలోని కైగల్ జలాశయం చాలా రోజుల తర్వాత జలసిరితో కళకళలాడింది. లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ జలాశయం వద్దకు పలువురు ప్రజలు చేరుకున్నారు.
అకాల వర్షం.. వారికెంతో సంతోషం! - చిత్తూరులో వర్షం వార్తలు
అకాల వర్షమే అయినా.. వారందరికీ ఆనందాన్ని పంచింది. చెరువుల్లో జలకళ సంతరించుకుందన్న తీరు చూసి.. జనాలంతా సంబరపడ్డారు.
heavy rain in chittoor district