చిత్తూరు జిల్లాలో బుధవారం ఒక్కరోజే.. 1,235 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,569 కి చేరింది. వైరస్ కారణంగా బుధవారం 10 మంది మృతిచెందగా... మొత్తం మరణాల సంఖ్య 199కు చేరింది. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు..11,363 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకోగా .. 8,007 మంది చికిత్స పొందుతున్నారు.
తిరుపతిలో భారీగా నమోదవుతున్న కేసుల దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. 14 రోజుల పాటు నగరంలో లాక్ డౌన్ విధించారు. నిర్ణీత సమయం వరకే దుకాణాల నిర్వహణకు అనుమతిచ్చారు. రోడ్ల పైకి వాహనాలను, ప్రజలను అనుమతించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తిరుమల బైపాస్ రోడ్‌కు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు.