చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చే భక్తులను కొందరు అక్రమార్కులు నిలువనా దోచేస్తున్నారు. పార్కింగ్ ఉచితమైనా ఒక్కొక్క వాహనానికి కి రూ.200 వరకు వసూలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు నుంచి వచ్చే వాహనాల రుసుములు పరిస్థితి అయితే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పార్కింగ్ కోసం వాళ్ళ ఇష్టం వచ్చినంత డిమాండ్ చేస్తున్నారు. అడిగింది ఇవ్వకుంటే వాహనాలను ముందుకు పంపడం లేదు. పార్కింగ్ ఉచితమన్న ప్రచార సూచికలు లేక అక్రమార్కులు దందా కొనసాగుతుంది.
గతంలో టెండర్ దారులు నెలకు రూ. 13 లక్షల చొప్పున సంవత్సరానికి రూ.1. 56 కోట్ల ఆదాయాని చెల్లించేవారు. లాక్డౌన్ కాలంలో నష్టపోయిన టెండర్లు.. చెల్లించాల్సిన మొత్తాన్ని కొంతమేర చెల్లించలేదు. పాత టెండర్లకు సెప్టెంబర్లో గడువు ముగిసింది. తాజాగా టెండర్లు నిర్వహించినప్పటికీ ఆదాయం రాని కారణంగా ఆలయ అధికారులు ఆ టెండర్లను రద్దు చేశారు.