చిత్తూరు జిల్లా కలికిరి 53వ సరిహద్దు భద్రతా దళంలో పనిచేస్తోన్న హెడ్ కానిస్టేబుల్ రాజేష్ బాబు (35) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కలికిరి పట్టణ శివారులో ద్విచక్రవాహనంపై వెళుతున్న రాజేష్ ముందున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో అదుపు తప్పి కిందపడ్డాడు. తీవ్ర గాయాల పాలైన అతన్ని స్థానికులు 108 వాహనంలో కలికిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం అనంతరం అధికారిక లాంఛనాలు నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
రోడ్డు ప్రమాదంలో ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్ మృతి - itbp head constable died in accident
ద్విచక్రవాహనంపై వెళ్తూ అదుపుతప్పి ఐటీబీపీలో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా కలికిరిలో జరిగింది. ముందున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్ మృతి