ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పన్నుల చెల్లింపుపై ప్రజల్లో అవగాహన పెరగాలి: సీజే - సీజే

ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ జాతీయ సదస్సును తిరుపతిలో నిర్వహించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. పన్నుల చెల్లింపుపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు.

hc-cj-tax-conference-in-tirupati

By

Published : Jun 22, 2019, 3:06 PM IST

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్

పన్నుల చెల్లింపుల విషయంలో ప్రజల్లో మరింత అవగాహన తీసుకురావాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.తిరుపతిలో ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు.హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీతారామమూర్తి,జస్టిస్ దుర్గాప్రసాద్,జస్టిస్ గంగారావు,జస్టిస్ విజయలక్ష్మి పాల్గొన్నారు.రెండు రోజుల పాటు జరగనున్న ఈ జాతీయస్ధాయి సదస్సులో నిపుణులు... పన్నుల చెల్లింపునకు సంబంధించి పలు అంశాల పై చర్చించనున్నారు.ఈ సందర్బంగా మాట్లాడిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ దేశంలోనే కీలక రంగమైన పన్నులకు సంబంధించి ఈ సదస్సు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.వచ్చే ఏడాది ఈ సదస్సును అమరావతిలో నిర్వహించాలని ఆయన నిర్వాహకులను కోరారు.

ABOUT THE AUTHOR

...view details