ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హథీరాంజీ మఠం మహంతుపై వేటు - మహంతు అర్జున్ దాస్ పై సస్పెన్షన్ వేటు వార్తలు

తిరుపతి హథీరాంజీ మఠం భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మఠం భూములను దుర్వినియోగం చేస్తున్నారంటూ మహంతుపై దేవాదాయశాఖ చర్యలు తీసుకుంది. మహంతు అర్జున్ దాస్ పై సస్పెన్షన్ వేటును వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Mahanthu  Suspense by governament
హథీరాం మఠం భూముల వ్యవహారంలో మహంతుపై వేటు

By

Published : Jan 29, 2020, 3:25 PM IST

హథీరాం మఠం భూముల వ్యవహారంలో మహంతుపై వేటు

మఠం భూములను దుర్వినియోగం చేస్తున్నారంటూ హథీరాంజీ మఠం మహంతుపై దేవాదాయశాఖ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు మహంతు అర్జున్ దాస్ పై చర్యలు తీసుకుంది. శ్రీకాళహస్తి దేవస్థాన ఈవోకు మఠం అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలను జారీ చేసింది. మహంతు అర్జున్ దాస్ అందుబాటులో లేకపోవటంతో ఆయన కార్యాలయానికి ప్రభుత్వ ఉత్తర్వులను అంటించారు. హథీరాంజీ మఠానికి.. తిరుపతి పరిసర ప్రాంతాల్లో వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఉండగా... వీటి నిర్వహణ వ్యవహారంలో మహంతుపై ఆరోపణలతో కూడిన నివేదిక గతంలోనే ప్రభుత్వానికి అందిందని అధికారులు పేర్కొన్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details