ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో వైభవంగా హనుమాన్ జయంతి - Hanuman Jayanti celebrations at tirupathi

తిరుమలలో హనుమాన్​ జయంతి వేడుకలను తితిదే వైభవంగా నిర్వహించింది. కాలినడక మార్గం ఏడో మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Hanuman Jayanti celebrations at Tirumala
తిరుమలలో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు

By

Published : May 17, 2020, 8:37 PM IST

తిరుమలలో హనుమాన్ జయంతిని తితిదే ఘనంగా నిర్వహించింది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీబేడి ఆంజనేయస్వామి వారికి, కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాపాలి తీర్థంలో గల శ్రీ ఆంజనేయస్వామి వారికి తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా పూజ కార్యక్రమాలను ఏకాంతంగా నిర్వహించారు.

ఇదీ చూడండి:పిడుగుపాటుకు వ్యక్తి సజీవ దహనం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details