ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు తితిదే ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి - hanuman jayanthi in thirumala

తితిదే ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. ఈ నెల 4 నుంచి 8వరకు వేడుకలు జరుగుతాయని తెలిపారు.

hanuman jayanthi celebrated june fourth at thirumala
టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి

By

Published : Jun 2, 2021, 7:07 PM IST

Updated : Jun 4, 2021, 8:28 AM IST

ఈ నెల నాలుగున తితిదే ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. తిరుగిరుల్లోని అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థలంగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 4నుంచి 8వరకు ఉత్సవాలు జరుగుతాయన్న అదనపు ఈవో.. ఆకాశ గంగలో అంజనీదేవి తపస్సు చేశారని పేర్కొన్నారు.

టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి

హనుమంతుడి జన్మస్థలం కిష్కింధ అని హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ స్వామి గోవిందానంద సరస్వతీ భిన్నమైన ప్రకటనలు చేయడాన్ని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి ఖండించారు. శాస్త్రాధారాలతో ఆంజనేయస్వామి తిరుమలలో జన్మించినట్లు ప్రకటించామని ధర్మారెడ్డి వెల్లడించారు.

ఇదీచదవండి.

jagananna house: వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణానికి రేపు శ్రీకారం

Last Updated : Jun 4, 2021, 8:28 AM IST

ABOUT THE AUTHOR

...view details