అనంతపురం జిల్లా చెర్లోపల్లి జలాశయం నుంచి విడుదల చేసిన కృష్ణా జలాలు... చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రంలోకి ప్రవేశించాయి. హంద్రీనీవా కాలువ ద్వారా వచ్చిన కృష్ణా జలాలకు ప్రజలు హారతి కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ... నియోజకవర్గంలో చెరువులు నింపటంతోపాటు... తాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తారని చెప్పారు. హంద్రీనీవాలో ప్రవాహం వచ్చే ఏడాది మార్చి వరకూ కొనసాగుతుందని వివరించారు. హంద్రీనీవా నీటితో శాశ్వతంగా కరవును దూరం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి హామీఇచ్చారు.
హంద్రీనీవా రాకతో... పెద్దతిప్ప సముద్రంలో సంబరాలు - పెద్దతిప్ప సముద్రంలో హంద్రీనీవా నీరు
హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు పెద్దతిప్ప సముద్రంలోకి ప్రవేశించాయి. అక్కడి ప్రజలు సంబరాలు చేసుకున్నారు.
పెద్దతిప్ప సముద్రంలో అడుగుపెట్టిన కృష్ణ జలాలు