ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హంద్రీనీవా కాలువ పనులు పూర్తయ్యేదెన్నడో..? - హంద్రీనీవా కాలువ పెండింగ్

పీలేరు రైతులు హంద్రీనీవా నీటి కోసం పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. కాలువ తవ్వి పదేళ్లు అయినా... అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అలసత్వం అన్నదాతలకు శాపంగా మారింది. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కాలువల పనులు పూర్తిచేయాలని కోరుతున్నారు.

handri neeva canal pending works
పదేళ్లు అవుతున్నా పూర్తికాని కాలువ పనులు

By

Published : Feb 11, 2020, 12:23 PM IST

హంద్రీనీవా కాలువ పనులు పూర్తయ్యేదెన్నడో..?

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువను తవ్వి 10 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఇప్పటివరకు చుక్కనీరు రాలేదు. జిల్లాలోని పీలేరు యూనిట్-2 హంద్రీనీవా కాలువ ద్వారా 15 మండలాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 7,410 ఎకరాల్లో కాలువలు తవ్వారు. 350 కోట్ల రూపాయలతో 1.45 టీఎంసీల సామర్ధ్యంతో అడవిపల్లి రిజర్వాయర్ నిర్మించారు.

ఎత్తిపోతల కోసం 6 చోట్ల లిఫ్ట్​ కేంద్రాలు నిర్మించారు. మోటార్లు, విద్యుత్ సబ్​స్టేషన్లు, కంట్రోల్ ప్యానెల్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఏళ్లతరబడి విద్యుత్ పరికరాలు వినియోగించని కారణంగా అవి తుప్పుపడుతున్నాయి. కాలువలు ముళ్ల కంపలతో దర్శనమిస్తున్నాయి. 90 శాతం పనులు పూర్తయ్యాయి. రెండుమూడు చోట్ల కాలువకు అడ్డుగా ఉన్న వంకలపై కొన్ని పనులు చేయాల్సి ఉంది.

ఈ పనులు పూర్తికాని కారణంగా నీరు వచ్చే పరిస్థితులు కనబడటంలేదు. ఈ ప్రాంతాల్లో వర్షాలు పడక చెరువులు, కుంటలు ఎండిపోయాయి. వందలాది ఎకరాలు బీళ్లుగా మారాయి. సాగు, తాగు నీటికి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కాలువల పనులు పూర్తిచేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:ఎండమావులు చూపి.. ఎడారిలో దింపి..!

ABOUT THE AUTHOR

...view details