వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద అర్హులైన చేనేత కార్మికులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. చిత్తూరు జిల్లా మదనపల్లిలో జౌళి శాఖ ఏడీ తిరుపాల్ను చేనేత కార్మికులు నిర్బంధించారు. ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల కారణంగా స్థానికంగా ఉన్న చేనేతలకు పథకం వర్తించటంలేదన్నారు.
నేతన్నలకు న్యాయం చేయాలంటూ జౌళిశాఖ ఏడీ నిర్బంధం - నేతన్నకు న్యాయం చేయాలని ఏడీ నిర్భందం !
చిత్తూరు జిల్లా మదనపల్లిలో జౌళిశాఖ ఏడీని స్థానిక చేనేత కార్మికులు నిర్బంధించారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద అర్హులైన చేనేత కార్మికులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
నేతన్నకు న్యాయం చేయాలని జౌళిశాఖ ఏడీ నిర్భందం !
తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే తమను అర్హులుగా ప్రకటించాలని స్థానిక శివాలంయం వద్ద ఏడీని రెండు గంటల పాటు నిర్బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకి చేరుకొని చేనేత కార్మికులకు సర్ధిచెప్పారు. నిబంధనల మేరకు అర్హులను ఎంపిక చేస్తున్నామని ఏడీ తెలిపారు.