ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో భారీగా నాటు తుపాకులు స్వాధీనం - భారీగా నాటు తుపాకులు స్వాధీనం

చిత్తూరు జిల్లా పోలీసులు 500 నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో భారీగా నాటు తుపాకులున్నాయన్న సమాచారంతో గత కొంతకాలంగా తనిఖీలు చేపట్టి వీటిని స్వాధీనం చేసుకున్నారు.

భారీగా నాటు తుపాకులు స్వాధీనం !
భారీగా నాటు తుపాకులు స్వాధీనం !

By

Published : Jun 23, 2020, 3:05 PM IST

చిత్తూరు జిల్లా పోలీసులు భారీగా నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో భారీగా నాటు తుపాకులున్నాయన్న సమాచారంతో గత కొద్ది రోజులుగా సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు.. ఇప్పటి వరకు 500 నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని పుంగనూరు, పలమనేరు, మదనపల్లె, చిత్తూరు నియోజకవర్గాల పరిధిలో అటవీ గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి వీటిని స్వాధీనం చేసుకున్నారు.

నాటు తుపాకీలు కలిగి ఉండటం నేరమంటూ ఆయా గ్రామాల్లో పోలీసులు ప్రజలకు గత కొంత కాలంగా అవగాహన కల్పిస్తున్నారు. దీంతో కొంతమంది నేరుగా... స్థానిక పోలీస్ స్టేషన్లలో నాటు తుపాకులు అప్పగించారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో... 500 నాటు తుపాకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి స్థాయిలో తనిఖీలు పూర్తయిన తర్వాత...నాటు తుపాకుల వ్యవహారంపై వివరాలు వెల్లడిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details