చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు వద్ద చిరు వ్యాపారులు ఆందోళనకు దిగారు. వంశపారంపర్యంగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోన్న తమపై విజిలెన్స్, పోలీసులు, ఫారెస్ట్ అధికారుల దాడులు చేస్తున్నారని ఆరోపించారు. టెండర్ల పేరుతో రౌడీ షీటర్స్కు లైసెన్సులు మంజూరు చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు వ్యాపారుల కోసం మూడు సార్లు టెండర్లు పిలవగా చిరు వ్యాపారుల జోలికి ఎవరూ రాలేదని తెలిపారు. అయితే గత ఎనిమిది నెలలుగా రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకుంటూ చెంగల్ రెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో వేధిస్తున్నాడని వాపోయారు. తమకు న్యాయం చేయాలని చిరు వ్యాపారులు డిమాండ్ చేశారు.
శ్రీవారి మెట్టు వద్ద చిరు వ్యాపారుల ఆందోళన - latest news of hackers issue in chandragiri mandal
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు వద్ద చిరు వ్యాపారులు ధర్నా నిర్వహించారు. టెండర్ల పేరుతో రౌడీషీటర్లకు లైసెన్సులు ఇస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
శ్రీవారి మెట్టు వద్ద చిరువ్యాపారుల ఆందోళన