'కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తగా ఉండాలి... సామాజిక దూరం పాటించాలి...' అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నా అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రజల్లో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదు. బ్యాంకులకు వెళ్లినవారు సామాజిక దూరం పాటించడం లేదు. బ్యాంక్ సిబ్బంది ఎటువంటి సూచికల బోర్డులు పెట్టడం లేదు. కనీసం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా.. సబ్బులు, శానిటైజర్లు పెట్టలేదు.
నిర్లక్ష్యంగా ప్రజలు... అధికారుల ఆదేశాలు బేఖాతరు - latest news on lock down
అనంతపురం జిల్లా గుంతకల్లులో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా వారి మాటలు పక్కనపెట్టి రోడ్లుపై సంచరిస్తున్నారు. కనీసం సామాజిక దూరం పాటించడం లేదు.
నిర్లక్ష్యంగా ప్రజలు
ఎటీఎం సెంటర్ల వద్ద గుంపులు గుంపులుగా ప్రజలు కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా జనం ద్విచక్ర వాహనంపై ఇద్దరు, ముగ్గురు వెళ్తున్నారు. పోలీసులు ఎంత అదుపు చేసినా వారి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు.
ఇదీ చదవండి: తెలంగాణాలో కరోనా మృతులంతా అక్కడి నుంచే వచ్చారు!