చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో విధులు నిర్వహించే ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీ మిస్ ఫైర్ అయింది. ప్రమాదంలో కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం గాయాలపాలయ్యారు. విధులు ముగించుకొని తుపాకీని గార్డ్ రూంలో అప్పగించే సమయంలో మిస్ఫైర్ అయినట్టు తెలిసింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తలించారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.