ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పైలెట్ ప్రాజెక్టుగా గుడికో గోమాత.. 28 దేవాలయాల్లో ఆలయానికో గోవు దానం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లోని 28 దేవాల‌యాల్లో గుడికో గోమాత కార్య‌క్ర‌మాన్ని తితిదే పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించనుంది. ఈ మేరకు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షుడు వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌తో క‌లిసి గురువారం సాయంత్రం అన్న‌మ‌య్య భ‌వ‌నంలో హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌నిర్వాహ‌క మండ‌లి స‌మావేశం నిర్వ‌హించారు.

పైలెట్ ప్రాజెక్టుగా గుడికో గోమాత.. 28 దేవాలయాల్లో ఆలయానికో గోవు దానం
పైలెట్ ప్రాజెక్టుగా గుడికో గోమాత.. 28 దేవాలయాల్లో ఆలయానికో గోవు దానం

By

Published : Sep 24, 2020, 10:45 PM IST

గుడికో గోమాత కార్యక్రమంపై అధికారుల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని గత నెలలో జరిగిన తితిదే ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సమావేశంలో తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో తిరుమల అన్నమయ్య భవనంలో హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ సమావేశం నిర్వహించారు. గుడికో గోమాత కార్యక్రమం హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఎస్వీ గోసంర‌క్ష‌ణ‌శాల ఆధ్వ‌ర్యంలో అమ‌లు చేయాలని తీర్మానం చేశారు.

జిల్లాకు ఓ గోవు..

తెలంగాణ‌లోని పాత 10 జిల్లాలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 13 జిల్లాల్లో జిల్లాకు ఓ ఆల‌యం చొప్పున‌, క‌ర్ణాట‌క రాష్ట్రంలోని 5 దేవాల‌యాల్లో క‌లిపి మొత్తం 28 ఆల‌యాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా ఈ కార్య‌క్ర‌మం ప్రారంభించ‌డానికి నిర్ణ‌యం తీసుకున్నారు. తితిదే ఎస్వీ గోసంర‌క్ష‌ణ‌శాల ద్వారా దేశ‌వాళీ ఆవుల దానాన్ని స్వీక‌రించాల‌ని తీర్మానించారు. మ‌ఠాలు, పీఠాలు, వంశ‌పారంప‌ర్య ప‌ర్య‌వేక్ష‌ణ ఆల‌యాలు, దేవాదాయ శాఖ ప‌రిధిలోని ఆల‌యాలు, వేద పాఠ‌శాలల‌కు ఈ కార్య‌క్ర‌మం ద్వారా గోవులను తితిదే అంద‌జేస్తుంది.

ఎవరికి వారే పోషణ భారం చూడాలి : తితిదే

గోదానం పొందిన సంబంధిత ఆల‌యాలు, పీఠాలు, వేద‌పాఠ‌శాల‌లు గోవుల పోషణ బాధ్యత చూడాల్సి ఉంటుంది. ఈ మేరకు తితిదే ధర్మకర్తల సమావేశంలో నిర్ణయించారు. తితిదే దానం ద్వారా పొందిన గోవుల వ‌ద్ద గుడికో గోమాత - తితిదే అనే బోర్డు త‌ప్ప‌నిస‌రిగా ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఎస్వీ గో సంర‌క్ష‌ణ‌శాల ముంద‌స్తు అనుమ‌తితోనే భ‌క్తులు ఈ కార్య‌క్ర‌మానికి గోవుల‌ను దానం చేయాల్సి ఉంటుందన్నారు. కార్య‌క్ర‌మానికి సంబంధించిన విధి విధానాలు, గోదానం ద‌ర‌ఖాస్తులను ఎస్వీ గో సంర‌క్ష‌ణ‌శాల డైరెక్ట‌ర్ పర్యవేక్షిస్తారు.

పైలెట్ ప్రాజెక్టుగా గుడికో గోమాత.. 28 దేవాలయాల్లో ఆలయానికో గోవు దానం

ఇవీ చూడండి : తిరుమల బ్రహ్మోత్సవాలు : గ‌జ వాహనంపై గోవిందుడి క‌టాక్షం

ABOUT THE AUTHOR

...view details