ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులకు రాయితీ విత్తనాల పంపిణీ - chittooor dst groundnut seed distribution latest news

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో వేరుశనగ రాయితీ విత్తనాలను 9 మండలాల రైతులకు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే చింతల రామంచంద్రారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

groundnut seeds distribution   to farmers in chittoor dst perleru
groundnut seeds distribution to farmers in chittoor dst perleru

By

Published : May 18, 2020, 7:20 PM IST

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని 9 మండలాల్లో 9 వేల క్వింటాల వేరుశెనగ రాయితీ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి.. పీలేరు, కలికిరి మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ అధికారులకు సహకరించాలని సూచించారు.

కె6, నారాయణి రకాల విత్తనాలను రాయితీ పోను 30 కిలోల వేరుశెనగ బస్తా ధర రూ.1,413 గా ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్ సాగులో వర్షాధార వేరుశనగకు అవసరమైన కాయలను రైతులు కొనుగోలు చేశారు. అదే విధంగా.. ఖరీఫ్ సాగుకు అవసరమైన పెట్టుబడి నిధిని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు ఎమ్మెల్యే చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details