ఇటీవల కురిసిన వర్షాలకు చిత్తూరు జిల్లాలో అడుగంటిన పాతాళ గంగ.. ఉబికి పైపైకి వస్తోంది. శ్రీరంగరాజపురం మండలం శ్రీరంగరాజపురంలో రైతు రమేశ్ నాయుడు వ్యవసాయ బావిలోంచి నీరు వెల్లువలా వస్తోంది. గతేడాది వరకు అంతంత మాత్రంగానే ఉన్న బోరుబావిలోని నీటి మట్టం.. అమాంతంగా పెరిగి నీరుపైకి వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమీప ప్రాంతాల్లో ఉన్న వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో.. భూగర్భ జలాల నీటిమట్టం పెరిగింది. వ్యవసాయ బావులు పూర్తిస్థాయిలో నిండాయి.
ఉప్పొంగిన పాతాళగంగ.. బోరుబావి నుంచి ఎగజిమ్ముతున్న నీరు - rains effect on chittor
బీటలు వారిన నేలలకు ముసిముసి నవ్వులు విరజిమ్ముతున్నాయి.. నీటి జాడ లేని నేలలు పచ్చని తొడుగు వేసుకుని మైమరపిస్తున్నాయి. అడుగంటిపోయిన పాతాళ గంగ ఉప్పొంగుతూ ఉరకలు వేస్తోంది. నిన్న మొన్నటి వరకు బోరుబావిలో జాడలేని నీరు పైపైకి పొంగుతోంది. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురంలో ఈ దృశ్యం కనువిందు చేస్తోంది.
బోరువ బావి నుంచి నీరు