కర్నూలు జిల్లా పాణ్యంలోని చెంచు కాలనీలో గిరిజనులకు కోవెల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సరుకులు పంపిణీ చేశారు. 360 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.1,200 విలువ చేసే నిత్యావసరాలు అందజేశారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో నియోజకవర్గ తెదేపా ఇంఛార్జీ అనీషారెడ్డి, కోఆర్డినేటర్ శ్రీనాథరెడ్డిలు హమాలీలు, పత్రికా విలేకరులకు కూరగాయలు, మాస్కులు అందించారు.