తిరుపతి గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పరిమళభరిత పూలమాలలు, విశేష తిరువాభరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన స్వామివారు.. పెద్దశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా పరమపద వైకుంఠనాధుడి అలంకారంలో దర్శనమిచ్చారు.
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఉత్సవాలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. స్వామి, అమ్మవార్లను వాహనసేవపై కొలువుదీర్చి వైదిక కార్యక్రమాలను నిర్వహించారు.