తిరుపతిలోని గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఈ రోజు రాత్రి స్వామివారు సరస్వతీమూర్తిగా హంస వాహనంపై దర్శనమిచ్చారు. సర్వాలంకారభూషితుడైన స్వామివారు హంస వాహనాన్ని అధిరోహించి భక్తులను కటాక్షించారు. పండితుల వేద పారాయణం, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు వైదికకార్యక్రమాలను ఏకాంతంగా నిర్వహించారు.
వైభవంగా సాగుతున్న గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు - చిత్తూరు జిల్లా వార్తలు
తిరుపతిలోని గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బుధవారం రాత్రి స్వామివారు హంస వాహనంపై దర్శనమిచ్చారు.
వైభవంగా సాగుతున్న గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు