తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు అర్చకులు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటలకు ఆలయ ప్రాంగణంలో సేనాధిపతి ఉత్సవం నిర్వహించి.. ముఖ మండపంలో వేంచేపు చేశారు. అక్కడ సేనాధిపతికి విశేష సమర్పణ, ఆస్థానం జరిపించారు. యాగశాలలో వైదిక కార్యక్రమాల అనంతరం శాస్త్రోక్తంగా అంకురార్పణం చేశారు. రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాల జరగనున్నాయి. కరోనా కారణంగా ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు మంగళవారం ఉదయం 7.55 నుంచి 8.30 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. అనంతరం ఆరోజు రాత్రి నుంచి వాహన సేవలు ప్రారంభం కానున్నాయి.
గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - Govindarajaswami's Brahmotsavalu latest update
శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు అర్చకులు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. కరోనా కారణంగా ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు మంగళవారం ఉదయం 7.55 నుంచి 8.30 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు.
![గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:50:24:1621257624-ap-tpt-30-17-ankurarpana-av-ap10014-17052021184237-1705f-1621257157-708.jpg)
గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ