కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణం ప్రజలకు ఒక విపత్కర సమయమని ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఈ పరిస్థితుల్లో తన నియోజకవర్గ ప్రజల సంరక్షణ బాధ్యతలను కుటుంబ పెద్దగా స్వీకరించినట్లు ఆయన తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు పంపిణీ చేయడానికి నాలుగు లక్షల మాస్కులు, శానిటైజర్లను ఆయా మండలాల ఎంపీడీవోలకు అందజేశారు.
'ప్రజల సంరక్షణ బాధ్యతను కుటుంబ పెద్దగా స్వీకరించా' - corona effect on people
కరోనా బారిన పడకుండా తన నియోజకవర్గ ప్రజలను ఆదుకోవలసిన బాధ్యత తనపై ఉందని చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు అందజేస్తానని తెలిపారు.
మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి