తిరుమల శ్రీ వారి దర్శనం కోసం వస్తున్న భక్తుల సౌకర్యార్థం నిర్మించ తలపెట్టిన గరుడ వారధి పనులను ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి లు ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగిపోయిన వారధి పనులను,త్రిసభ్య కమిటీ పరిశీలించి నిర్మాణానికి అనుమతులిచ్చింది. ప్రజాధనానికి పైసా నష్టం లేకుండా చేయాలనే సత్సంకల్పంతోనే గరుడ వారధి పనులు కొన్ని రోజులు పాటు ఆగాయని నేతలు చెప్పారు. సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో రాష్ట్రాభివృద్ధికోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని వారు తెలిపారు.
గరుడ వారధి పనులను ప్రారంభించిన.. ప్రభుత్వ విప్ - Government whip Chevi Reddy Bhaskar Reddy has started the Garuda bridge
తిరుమల భక్తుల సౌకర్యార్థం ఉపయోగపడే గరుడ వారధి పనులను ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు.
Government whip Chevi Reddy Bhaskar Reddy has started the Garuda bridge works for the benefit of the Tirumala devotees.