టమాటా ధరలు పడిపోవటంతో.. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో వాటిని కొనేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్లో ఐదు మెట్రిక్ టన్నుల టమాటాలు కొనుగోలు చేశారు. వాటిని తిరుపతి రైతు బజార్‌కు తరలించేందుకు చర్యలు చేపట్టారు. 30కిలోల టమాటాలను వంద రూపాయలకు కొనుగోలు చేసినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. రైతులు ఆర్థికంగా నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు చేసిందని మదనపల్లి మార్కెట్ యార్టు సహాయ కార్యదర్శి వినయ్ చెప్పారు.
టమాటా కొనుగోళ్లకు ప్రభుత్వ నిర్ణయం.. 30కిలోలు రూ. వందే - Government decided to purchase tomatoes news
టమాటా ధరలు పడిపోవటంతో వాటి కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు కొనుగోలు జరుపుతున్నామని చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్ యార్డు సహాయ కార్యదర్శి వినయ్ తెలిపారు.
టమాటా కొనుగోళ్లకు ప్రభుత్వ నిర్ణయం