ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో ఘనంగా అమ్మ ఒడి

చిత్తూరు జిల్లాలో అమ్మ ఒడి కార్యక్రమాన్ని నేతలు ఘనంగా ప్రారంభించారు. పేద విద్యార్థుల అభ్యున్నతి కోసమే సీఎం జగన్​ కార్యక్రమానికి రూపకల్పన చేశారని అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకుని అత్యున్నత స్థానాలకు చేరుకోవాలని వారు సూచించారు.

amma vodi in chittoor
చిత్తూరు జిల్లా అమ్మఒడి

By

Published : Jan 11, 2021, 5:44 PM IST

చిత్తూరు జిల్లా పుత్తూరు బాలికల ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే రోజా సోమవారం అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని.. అందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో అమ్మ ఒడి కార్యక్రమాన్ని రూపకల్పన చేశారని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో 32,904 మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఇందుకోసం సుమారు 48 కోట్ల రూపాయలు జమ అవుతున్నట్టు తెలియజేశారు. అలాగే పేద విద్యార్థుల కోసం జగనన్న విద్యా కానుక, సంపూర్ణ పోషకాహారం పథకం జగనన్న విద్యా దీవెన వంటి కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయని రోజా స్పష్టం చేశారు. వీటిని సద్వినియోగం చేసుకొని పిల్లలందరూ బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details