తిరుమల శ్రీవారికి గోదాదేవి పూలమాలలను అలంకరించారు. శ్రీవారికి మహా భక్తురాలైన గోదాదేవి పరిణయోత్సవాన్ని పురస్కరించుకొని గోదామాలలను శ్రీవారి మూలవిరాట్‌కు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని ఆండాళ్ శ్రీ గోదాదేవి చెంత నుంచి పెద్ద జీయర్ మఠానికి పూలమాలలు చేరుకున్నాయి. అక్కడినుంచి మంగళవాయిధ్యాల నడుమ తిరుమాడవీధుల్లో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. పూజ కార్యక్రమాలు నిర్వహించి మూలవిరాట్‌కు అలంకరించారు.
తిరుమల శ్రీవారికి గోదాదేవి పూలమాలల అలంకరణ - తిరుమల వార్తలు
తిరుమల శ్రీవారికి మహా భక్తురాలైన గోదాదేవి పరిణయోత్సవాన్ని పురస్కరించుకొని గోదామాలలను శ్రీవారి మూలవిరాట్‌కు సమర్పించారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని ఆండాళ్ శ్రీ గోదాదేవి చెంత నుంచి తిరుమాడవీధుల్లో ఊరేగింపుగా పూలమాలలు ఆలయానికి చేరుకున్నాయి.
గోదాదేవి పూలమాలల అలంకరణ