తన కుమార్తెతో సన్నిహితంగా ఉంటూ దొరికాడనే ఆగ్రహంతో.. ఓ యువకుడిని అత్యంత పాశవికంగా యువతి తండ్రి నరికి చంపిన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ( Palamaneru Mandal ) పెంగరగుంటలో ( Pengaragunta ) ఆలస్యంగా వెలుగు చూసింది. యువకుడిది తక్కువ కులం కావటం, తన కుమార్తె తప్పు చేసిందనే భావనతో విచక్షణ కోల్పోయిన యువతి తండ్రి.. కిరాకతకంగా యువకుడిని నరికేశాడు. అనంతరం మృతదేహాన్ని బావిలో పడవేశాడు. ఈ క్రమంలో పోలీసులకు దొరికిపోతాననే భయంతో రెండు రోజుల తర్వాత దేహాన్ని ఖండఖండాలుగా నరికి తన పొలంలోనే పాతిపెట్టటం పోలీసులనే గగుర్పాటుకు గురి చేసింది.
లాక్డౌన్ కారణంగా స్వగ్రామానికి రాక..
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంటలో పరువు హత్య వెలుగుచూసింది. గ్రామానికి చెందిన 22ఏళ్ల ధనశేఖర్ ( Dhanshekhar ) అనే యువకుడు బెంగుళూరులో డ్రైవర్గా (Driver in Bangalore ) పనిచేస్తుండగా.. లాక్ డౌన్ కారణంగా గ్రామానికి తిరిగి వచ్చాడు. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ధనశేఖర్ నివాసానికి తిరిగి రాకపోవటంతో.. సోమవారం పలమనేరు ఠాణాలో బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో రెండేళ్లుగా ప్రేమలో ఉన్నాడని, ఈ మేరకు యువతి తండ్రిపై అనుమానం ఉందని పోలీసులకు తెలిపారు.
విచారణలో దారుణ విషయాలు..
ఈ నేపథ్యంలో పోలీసులు మిస్సింగ్ కేసు ( Missing Case ) కింద దర్యాప్తు ప్రారంభించగా.. విచారణలో దారుణ విషయాలు వెలుగు చూశాయి. యువతి తండ్రి బాబు కాల్ డేటా, ధనశేఖర్ కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు.. శనివారం రాత్రి యువతి తండ్రి నుంచి బాధితుడికి ఫోన్ వెళ్లినట్లు గుర్తించారు. అనంతరం నిందితుడు బాబును అదుపులోకి తీసుకుని విచారించగా.. అత్యంత పాశవికంగా కత్తితో నరికేశానని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.
విచక్షణ కోల్పోయి..