చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం సింగిరెపల్లె గ్రామ సమీపంలో పొలం దున్నుతున్న ట్రాక్టర్ పైనుంచి జారిపడ్డ చిన్నారి హాసిని(6) మృతి చెందింది. బాలిక పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆడుతూపాడుతు తిరిగే చిన్నారి మరణించటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చౌడేపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ పైనుంచి జారిపడి బాలిక మృతి - చిత్తూరు జిల్లా వార్తలు
పొలం దున్నుతున్న ట్రాక్టర్ పైనుంచి జారిపడి ఆరెళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం సింగిరెపల్లె గ్రామంలో చోటుచేసుకుంది.
ట్రాక్టర్ నుంచి జారి పడ్డ బాలిక మృతి