ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆడుకోవటానికి చెరువులోకి దిగి.. బాలిక మృతి - latest news in Chittoor district

మదనపల్లె మండలం తురకపల్లె సమీపంలోని చెరువులో పడి ఓ బాలిక మృతి చెందింది. ఆడుకునేందుకు చెరువులోకి దిగి.. ప్రమాదవశాత్తు నీట మునిగింది.

girl died
ఆడుకోవటానికి చెరువులోకి దిగి.. నీటమునిగిన ఓ బాలిక మృతి

By

Published : Mar 20, 2021, 11:29 AM IST

చిత్తూరు జిల్లా తురకపల్లె సమీపంలోని చెరువులో పడి ఓ బాలిక చనిపోయింది. మదనపల్లె గ్రామీణ మండలం తురకపల్లెకు చెందిన మానస తోటి చిన్నారులతో కలిసి.. స్థానికంగా ఉండే చెరువు గట్టు వద్దకు వెళ్లారు. మిత్రులతో కలిసి చిన్నారి.. ఆడుకోవటం కోసం చెరువులోకి దిగింది. లోతు ఎక్కువగా ఉండటంతో మానసతో పాటు మరో ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు వారిని రక్షించేందుకు యత్నించారు. అప్పటికే ఆలస్యం అవటంతో మానస ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు చిన్నారులను స్థానికులు కాపాడారు.

ABOUT THE AUTHOR

...view details