ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అత్యాచారానికి ప్రయత్నించారని... బాలిక ఆత్మహత్యాయత్నం - చిత్తూరు జిల్లా పుంగనూరు

చిత్తూరు జిల్లా పుంగనూరులో అత్యాచారం చేయడానికి ప్రయత్నించారని బాలక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అత్యాచారానికి ప్రయత్నించారని... బాలిక ఆత్మహత్యాయత్నం

By

Published : Sep 24, 2019, 10:39 AM IST

చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం జరిగింది. ఓ బాలికపై 12 రోజుల క్రితం కొంతమంది అత్యాచార ప్రయత్నం చేయగా... మనస్తాపం చెందిన బాలిక అవమాన భారంతో ఆత్మహత్యకు ప్రయత్నించింది. కర్ణాటకలోని కోలార్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రస్తుతం బాలిక చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అత్యాచారానికి ప్రయత్నించారని... బాలిక ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details