ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫ్యాన్​కు ఉరేసుకుని యువతి ఆత్మహత్య - చిత్తూరు జిల్లా పీలేరు వార్తలు

చిత్తూరు జిల్లా పీలేరు పట్టణంలో.. ఫ్యాన్​కు ఉరేసుకుని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పీలేరులోని ఇందిరమ్మ కాలనీలో.. తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న అలేఖ్య.. తిరుపతిలో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసింది. వ్యక్తిగత కారణాలతోనే.. అలేఖ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

girl suicide
ఫ్యాన్​కు ఉరేసుకుని యువతి ఆత్మహత్య

By

Published : Apr 7, 2021, 1:52 PM IST

చిత్తూరు జిల్లా పీలేరు పట్టణంలో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పీలేరులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన అలేఖ్య తండ్రి రమణ ఆర్టీసీ కండక్టర్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. అలేఖ్య తిరుపతిలో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి ఇంట్లోని ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

వారపు సంతకు వెళ్లిన అలేఖ్య తల్లి.. తిరిగి వచ్చేసరికి తన కూతురు విగతజీవిగా కనిపించటంతో ఆందోళనకు గురైంది. స్థానికుల సహాయంతో అలేఖ్యను కిందకు దించి ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. వ్యక్తిగత కారణాలతోనే యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details